ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విచారణకు హాజరైన విజయ్‌ మద్దూరి

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:03 AM

జన్వాడలోని కేటీఆర్‌ బావమరిది రాజ్‌పాకాల ఫాంహౌస్‌ పార్టీలో డ్రగ్స్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చిన విజయ్‌ మద్దూరి బుధవారం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

శంకర్‌పల్లి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జన్వాడలోని కేటీఆర్‌ బావమరిది రాజ్‌పాకాల ఫాంహౌస్‌ పార్టీలో డ్రగ్స్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చిన విజయ్‌ మద్దూరి బుధవారం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయనను... నార్సింగి పోలీసులు సుమారు 3గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా... పార్టీలో కొకైన్‌ తీసుకున్నారా? ఫారిన్‌ లిక్కర్‌ ఎక్కడిది? రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు నిందితుడు కేదారినాథ్‌తో సంబంధం ఏంటి? అని ప్రశ్నించినట్లు సమాచారం.


తాను గత నెల 10-14 తేదీల్లో నెదర్లాండులో ఉండగా కోకైన్‌ తీసుకున్నానని, ఇక్కడ తీసుకోలేదని విజయ్‌ చెప్పినట్లు తెలిసింది. అలాగే కనిపించకుండా పోయిన సెల్‌ఫోన్‌ గురించి ఆరా తీయగా... అది ఆరోజే పోయిందని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 07 , 2024 | 03:03 AM