ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ts News: బీఆర్ఎస్ హయాంలో వికారాబాద్ రాడార్ సెంటర్ నిర్మాణం: మంత్రి కొండా సురేఖ

ABN, Publish Date - Jan 30 , 2024 | 01:27 PM

దేశ రక్షణలో భాగంగా వికారాబాద్ రాడార్ సెంటర్ నిర్మాణం జరిగిందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. దేశంలో రెండో కేంద్రంగా వికారాబాద్ ఉందన్నారు. ఇలాంటి కేంద్రాలు తమిళ్ నాడులో ఉన్నాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంచేశారు.

హైదరాబాద్: దేశ రక్షణలో భాగంగా వికారాబాద్ రాడార్ సెంటర్ నిర్మాణం జరిగిందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పష్టంచేశారు. దేశంలో రెండో కేంద్రంగా వికారాబాద్ ఉందన్నారు. ఇలాంటి కేంద్రాలు తమిళ్ నాడులో ఉన్నాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంచేశారు. వికారాబాద్‌లో రాడార్ సెంటర్ నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తుచేశారు. రాడార్ సెంటర్ కోసం 2010లో ఒప్పందాలు జరిగాయని కొండా సురేఖ వివరించారు. 2014లో భూముల బదలాయింపు, స్టేజ్ వన్ ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. 2017లో ధరల పెంపు, స్థలం మార్పు జరిగాయని వివరించారు. ఆ సమయంలోనే రూ.102 కోట్ల నిధులు విడుదల చేశారని వివరించారు. 2017 నవంబర్ 14న స్టేజ్-2 ఒప్పందాలు జరిగిందని, ఆ ఏడాదిలో జీవోను అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.

రాడార్ సెంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నష్టం జరిగే ప్రాజెక్టు కాదు కాబట్టే పరిశీలన చేసి తుది జీవో విడుదల చేశామని కొండా సురేఖ తేల్చిచెప్పారు. జంతువులు, మనుషుల ప్రాణాలకు ముప్పు లేదని స్పష్టంచేశారు. రాడార్ ప్రాజెక్టు వల్ల ప్రకృతికి నష్టం జరగదని, గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు, కొత్త ప్రాజెక్టులు వస్తాయని వివరించారు. పరిరక్షణ కమిటీ, గ్రామాల నుంచి ప్రజలను తమిళనాడు పర్యటనకు తీసుకెళ్తామని స్పష్టంచేశారు. రెండు, మూడు నెలల్లో రాడార్ సెంటర్‌కు శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. నాలుగు ఏళ్లలో నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 01:39 PM

Advertising
Advertising