ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు

ABN, Publish Date - May 13 , 2024 | 01:52 PM

తెలంగాణ‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు.

హైదరాబాద్, మే 13: తెలంగాణ‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. అయితే రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం జరుగుతున్న పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదంటూ.. ఆ యా గ్రామాల ప్రజలు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.

Revanth Reddy: ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధానినో తేల్చుకోండి..


నాగర్ కర్నూలు మండలంలోని బల్మూర్‌లో మైనింగ్‌కి ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో పోలింగ్‌ను బహిష్కరించినట్లు వారు తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్తులు సైతం పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బహిష్కరించినట్లు వారు పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర రాజనరసింహా.. ఏమన్నారంటే


అదే విధంగా యాద్రాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని కనుముక్కల గ్రామస్తులు ఈ ఎన్నికలను బహిష్కరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాజకీయ నాయకులకు విజ్జప్తి చేసినా.. వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించినట్లు వారు స్పష్టం చేశారు. అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తే.. ఓటు వేసేందుకు తామంతా సిద్దమని కనుముక్కల గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు.

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటల పోలింగ్ శాతమిదే.. ఆ రాష్ట్రంలో అత్యధికం


అదే విధంగా నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామస్తులు కూడా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ గ్రామంలో రహదారి సమస్య ఉందని.. దీనిని చాలా కాలంగా ప్రభుత్వం పరిష్కరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 13 , 2024 | 01:57 PM

Advertising
Advertising