Wanaparthy: బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఆశ్చర్యపోయిన జనం
ABN, Publish Date - Aug 07 , 2024 | 05:20 PM
ప్రజల కష్టాలు తెలిసే నేత వాటి పరిష్కరించడానికి చూపే చొరవ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో అలాంటి వారు అరుదు. వారిలో వనపర్తి ఎమ్మెల్యే కూడా ఒకరు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Tudi Megha Reddy) ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
వనపర్తి: ప్రజల కష్టాలు తెలిసే నేత వాటి పరిష్కరించడానికి చూపే చొరవ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో అలాంటి వారు అరుదు. వారిలో వనపర్తి ఎమ్మెల్యే కూడా ఒకరు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Tudi Megha Reddy) ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తాజాగా ఆయన బస్సు డ్రైవర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. వనపర్తి పట్టణంలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ఎన్నో రోజులుగా స్థానికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
గత బీఆర్ఎస్ సర్కార్ స్థానికుల డిమాండ్లను పట్టించుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం.. వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా తూడి మేఘారెడ్డి గెలవడంతో నియోజవకర్గంలో సమస్యలు ఒక్కోటి పరిష్కారం అవుతూ వస్తున్నాయి. వనపర్తి పట్టణంలో బస్సు ఏర్పాటు చేయాలనే డిమాండ్ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇందుకు కంకణబద్ధుడయ్యారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలో లోకల్ సర్వీసులు ప్రారంభించారు.
ఆశ్చర్యపోయిన జనం..
బస్సు సర్వీసులు ప్రారంభించాం కదా మన పనైపోయిందనుకుని ఆయన అక్కడ్నుంచి వెళ్లలేదు. స్టీరింగ్ చేతపట్టి.. డ్రైవర్ అవతరం ఎత్తారు. స్వయానా ఆయనే బస్సు డ్రైవింగ్ చేస్తూ పట్టణంలోని 10 కి.మీ.ల మేర ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇదంతా చూసిన ప్రజలు షాక్‌కి గురయ్యారు. ఎమ్మెల్యే డ్రైవింగ్ చేస్తున్నారన్న విషయం క్షణాల్లో పట్టణం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. దాంతో డ్రైవింగ్ చేసే ఎమ్మెల్యేలను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.
ఎన్నో రోజుల తమ డిమాండ్‌ను నెరవేర్చినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన నేతగా ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మొదటగా వనపర్తి పట్టణ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే బస్సును ప్రారంభించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
Updated Date - Aug 07 , 2024 | 05:31 PM