ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maoist: స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు సుధాకర్ దంపతుల మృతదేహాలు

ABN, Publish Date - Apr 19 , 2024 | 08:43 AM

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్‌రావు అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ మురళి, ఆయన భార్య దాశేశ్వర్‌ అలియాస్‌ సుమన అలియాస్‌ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్‌లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత (Maoist Leader) సిరిపెల్లి శంకర్‌రావు అలియాస్‌ సుధాకర్‌ (Sudhakar) అలియాస్‌ మురళి, ఆయన భార్య దాశేశ్వర్‌ అలియాస్‌ సుమన అలియాస్‌ రంజిత (Ranjita)ల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్‌ (Chhattisgarh Encounter)లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు. సుధాకర్ రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఒకే గ్రామం నుంచి ఆస్కార్ అవార్డు పొందిన చంద్రబోస్ ఉంటే.. అదే గ్రామం నుంచి మావోయిస్టు దళ కమాండర్ సిరిపెల్లి శంకర్ ఉన్నారు. ఒకే వీధిలో చంద్రబోస్, శంకరరావు ఇళ్లు ఉన్నాయి.


ఛత్తీస్‌గడ్‌లో కాంకెర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.


ఇందులో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన శంకర్‌రావు ఉన్నట్లు వెల్లడి కావడంతో.. తల్లి రాజపోచమ్మ, కుటుంబ సభ్యులు గురువారం ఉదయం కాంకేర్‌కు చేరుకుని, అక్కడ శంకర్‌రావు, రంజితల మృతదేహాలను గుర్తించారు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌కు చెందిన రంజిత మృతదేహాన్ని కూడా తీసుకెళ్తామని శంకర్‌రావు కుటుంబ సభ్యులు కోరడంతో పోలీసులు అనుమతిచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం మృతదేహాలు చల్లగరిగె చేరుకున్నాయి. చల్లగరిగెకు చెందిన రాజపోచమ్మ, ఓదేలు దంపతుల కుమారుడైన సిరిపెల్లి సుధాకర్‌ అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ పట్ల ఆకర్షితుడై చిన్నతనంలోనే ఉద్యమ బాట పట్టారు. 1998లో జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక 2000 సంవత్సరంలో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్యమంలోనే రంజితను వివాహం చేసుకున్నారు. వారి అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి.


కాగా మంగళవారం మధ్యాహ్నం ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్‌ రావు కూడా ఉన్నారు. శంకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో ఏడు ఏకే-47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఛోటె బతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన కాంకెర్ జిల్లాలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు నెలల సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారు: మంత్రి పొన్నం

ఆలూరులో నేడు చంద్రబాబు పర్యటన

తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 08:46 AM

Advertising
Advertising