ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా.. ప్రెస్‌మీట్ నుంచి ఇంట్లోకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు

ABN, Publish Date - Mar 13 , 2024 | 12:10 PM

హనుమకొండ: పట్టణంలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రమా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి బుధవారం ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వచ్చారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

హనుమకొండ: పట్టణంలోని ఆరూరి రమేష్ (Aruri Ramesh) ఇంటి దగ్గర హైడ్రమా (Hy drama) చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీకి రాజీనామా (Resign) చేసేందుకు సిద్ధమైన ఆరూరి బుధవారం ప్రెస్ మీట్ (Press Meet) పెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య (MLC Baswaraju Saraiah), ఇతర బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన మెత్తబడలేదు. ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఇంట్లోకి తీసుకెళ్లారు.

మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో ‘జై ఆరూరి’ అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు. పార్టీకి రాజీనామా చేయవద్దని బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆరూరి రమేష్‌ను బుజ్జగిస్తున్నారు. కాగా ఆయన బీజేపీ (BJP)లో చేరుతున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2024 | 12:34 PM

Advertising
Advertising