Cirme News: దారుణం.. మహిళపై కన్నేసిన కామాంధుడు.. ఆమె బహిర్భూమికి వెళ్లగా..
ABN, Publish Date - Dec 26 , 2024 | 09:51 AM
తెలంగాణ: ఆడవారిపై అత్యాచారాలు, హత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా మహిళలపై ప్రతి రోజూ లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకో అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది. ఒక ఘటన జరిగి దాన్ని మరవకముందే మరో ఘటన కలకలం రేపుతోంది.
జయశంకర్ భూపాలపల్లి: ఆడవారిపై అత్యాచారాలు, హత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా మహిళలపై ప్రతి రోజూ లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకో అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది. ఒక ఘటన జరిగి దాన్ని మరవకముందే మరో ఘటన కలకలం రేపుతోంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. చట్టాలను పటిష్ఠంగా అమలు చేస్తున్న వారిలో భయం కలగడం లేదు. అబలలపై నిత్యం అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులు, రోడ్లు, బస్సులు ఇలా ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. చివరికి ఇంట్లో ఆడివారిపై సైతం దాడులకు తెగబడుతున్నారు కామాంధులు. ప్రేమ పేరుతో ఒకరు, కామవాంఛలు తీర్చాలని మరొకరు నిత్యం అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.
తాజాగా అటువంటి ఘటనే ఒకటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మహాదేవపూర్ మండలంలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. కామవాంఛలు తీర్చుకునేందుకు ఓ అమాయకురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒంటరిగా వస్తుందని తెలుసుకుని మాటువేసిన దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మహాదేవపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై కామాంధుడు కన్నేశాడు. కొన్ని రోజులుగా కామవాంఛలు తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు సదరు మహిళ ఏమాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆ దుర్మార్గుడు మహిళపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్రతి రోజూ ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏ సమయంలో ఏం చేస్తుందో నిఘా పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలు రోజూ ఉదయం బహిర్భూమికి వెళ్తుందని నిందితుడు కనిపెట్టాడు.
ప్రతి రోజూ లాగానే ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ఆ మహిళ ఊరి బయటకు బహిర్భూమికి వెళ్లింది. అయితే అప్పటికే అక్కడ మాటువేసిన దుర్మార్గుడు మహిళను అడ్డగించాడు. కోరికలు తీర్చాలంటూ బెదిరింపులకు దిగాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేస్తున్నప్పటికీ.. తెల్లవారుజాము కావడంతో గ్రామస్థులంతా నిద్రలో ఉన్నారు. ఆమె అరుపులు గ్రామంలో ఉన్నవారికి వినిపించలేదు. దీంతో కామాంధుడికి అడ్డులేకుండా పోయింది. మహిళపై అత్యాచారం చేసి అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. ఘటన గురించి బాధితురాలు భర్త తెలపగా వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Updated Date - Dec 26 , 2024 | 09:51 AM