Konda Surekha: సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలి
ABN, Publish Date - Feb 26 , 2024 | 07:58 PM
సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. సోమవారం నాడు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆవిష్కరించారు.
వరంగల్: సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. సోమవారం నాడు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీన్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.... రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్ధిపై శిక్షణను ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారని చెప్పారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తుందని తెలిపారు. ఈ సెంటర్ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను “వైల్డ్ ఫ్లేవర్స్” బ్రాండ్ పేరుతో ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తీసుకువస్తుందని అన్నారు. ములుగు ఫారెస్ట్ కాలేజ్‌లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు.
Updated Date - Feb 26 , 2024 | 07:58 PM