Konda Surekha: గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..
ABN, Publish Date - Oct 14 , 2024 | 07:35 AM
వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. మంత్రి సురేఖ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది. దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది.
వరంగల్: గీసుగొండ వివాదం (Geesugonda Controversy)పై మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha) స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుచరులపై అణచివేత చర్యలకు పాల్పడితే ఉక్కుపిడికిలితో సమాధానం చెబుతామంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం వంటిది... కొందరు పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌లో నిర్భంధించారని తెలిసి అక్కడికి వెళ్లాను.. నిర్భంధించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాను.. నాపై అభిమానంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నా వెంట వచ్చారు.. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు.. ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు తన రాకను ఉద్దేశించి తమ కుటుంబం అంటే గిట్టని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నీతిమాలిన పనులకు పాల్పడుతున్నారు.. కొండా కుటుంబంపై బురదజల్లే చర్యలకు పాల్పడుతున్నారు’’ అంటూ మంత్రి కొండా సురేఖ ప్రకటన విడుదల చేశారు.
పూర్తి వివరాలు..
వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. మంత్రి సురేఖ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది. దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేకపోవడంతో కొండా వర్గీయులతో రేవూరి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు ఆ ఫ్లెక్సీ చినిగి ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే రేవూరి వర్గానికి చెందిన వ్యక్తి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టారని ఆరోపిస్తూ కొండా వర్గీయులు ఆదివారం ధర్మారం వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ పెద్దసంఖ్యలో అనుచరులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు ఆటోలో వచ్చారు. నేరుగా తమవారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పోలీసులు తమను కొట్టారని వారు మంత్రికి చెప్పటంతో డీసీపీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ నుంచే వరంగల్ నగర పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝాకు ఫోన్ చేసి ఎస్‌ఐ, సీఐ, డీసీపీలను రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటికి స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. మంత్రి వర్గీయులతో ఆమె ముందే మాట్లాడారు. దీంతో శాంతించిన మంత్రి స్టేషన్ నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ కుర్చీలో కూర్చోవడం కొత్త వివాదానికి దారితీసింది. ప్రొటోకాల్ నిబంధనల్ని మంత్రి ఉల్లంఘించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 14 , 2024 | 07:35 AM