ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajagopalreddy: కేసీఆర్ రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారు

ABN, Publish Date - Jan 08 , 2024 | 03:19 PM

Telangana: గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల ఝాన్సీ- రాజేందర్ రెడ్డి స్కిల్‌డెవలప్‌‌మెంట్ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

మహబూబాబాద్, జనవరి 8: గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Munugodu MLA Rajagopal reddy) వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల ఝాన్సీ- రాజేందర్ రెడ్డి స్కిల్‌డెవలప్‌‌మెంట్ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమాండ్ల ఝాన్సీ - రాజేందర్ దంపతులు సొంత డబ్బులతో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అధికారం అడ్డంపెట్టుకుని ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakarrao) పాలకుర్తిలో అరాచకాలు చేశారని ఆరోపించారు.

ఇప్పుడు ఎవరూ ఎవరికీ భయపడొద్దని.. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందన్నారు. కేసీఆర్ (BRS Chief KCR) రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారన్నారు. కేసీఆర్ తిన్న లక్ష కోట్ల డబ్బును కక్కిస్తామన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు ఐదు వందల కోట్ల అవినీతికి పాల్టడ్డారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకరరావు తరను ఓడించేందుకు మునుగోడులో ప్రచారం చేశారని.. అందుకే కావాలనే ఇవాళ పాలకుర్తిలో అడుగుపెట్టానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2024 | 03:19 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising