ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: తెలంగాణ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..

ABN, Publish Date - Dec 01 , 2024 | 09:23 AM

ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు.

ములుగు: తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఇల్లందు- నర్సంపేట ఏరియా కార్యదర్శి భద్రు సహా కీలక నేతలు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.


మృతులు వీరే..

ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. టీఎస్‌సీఎం ఇల్లందు-నర్సంపేట సెక్రటరీ కుర్సం మంగు భద్రు అలియాస్ పాపన్న, ఏటూరునాగారం- మహదేవ్‌పూర్ డీవీసీఎం కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఏసీఎం ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఏసీఎం ముస్సాకి జమున, పార్టీ సభ్యులు జైసింగ్, కిషోర్, కామేశ్‌లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.


ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు నవంబర్ 22న ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని, ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు. మృతులను ఉయిక రమేశ్‌, ఉయిక అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, రమేశ్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. వీరిని హతమార్చడంతోనే భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టి ఏడుగురు మావోయిస్టులను హతమార్చినట్లు తెలుస్తోంది.


కాగా, మావోయిస్టులపై గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు నవంబర్ 22న చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సైతం భారీ ఎన్‌కౌంటర్ నిర్వహించారు. ఆ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Updated Date - Dec 01 , 2024 | 12:20 PM