ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: రష్యాలో వరంగల్‌ కలంకారీ దరీస్‌‌కి అరుదైన అవకాశం..

ABN, Publish Date - Aug 02 , 2024 | 07:00 PM

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా "కలంకారీ దరీస్‌"కి రష్యా దేశంలో అరుదైన అవకాశం దక్కింది. రష్యాలో భారత రాయబార కార్యాలయం, ఓరియంటల్‌ స్టడీస్‌, రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సంయుక్తంగా భారత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌‌లో కలంకారీ దరీస్ ప్రదర్శించారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా వరంగల్‌ జిల్లా నుంచి కలంకారీకి చోటు దక్కినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా "కలంకారీ దరీస్‌"కి రష్యా దేశంలో అరుదైన అవకాశం దక్కింది. రష్యాలో భారత రాయబార కార్యాలయం, ఓరియంటల్‌ స్టడీస్‌, రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సంయుక్తంగా భారత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌‌లో కలంకారీ దరీస్ ప్రదర్శించారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా వరంగల్‌ జిల్లా నుంచి కలంకారీకి చోటు దక్కినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.


రష్యాలో భారత రాయబార కార్యాలయం భారత ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. ఎగ్జిబిషన్‌లో 10రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని భారత రాయబారి వినయ్‌కుమార్‌ ప్రారంభించారు. కేవలం చేతి వృత్తుల ఉత్పత్తులను మాత్రమే కార్యక్రమంలో ప్రదర్శించడం ఆకర్షణీయంగా నిలిచింది. మెుత్తం 21రకాల వస్తువులతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు వినయ్ కుమార్ తెలిపారు. "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" విధానాన్ని ప్రపంచమంతా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.


జమ్మూ కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో తెలంగాణ వరంగల్ నుంచి కలంకారీ దరీస్‌, తమిళనాడు నుంచి కాంచీపురం పట్టుపావడ, మధ్యప్రదేశ్‌ అశోక్‌నగర్‌ నుంచి చందేరి చీరలు, కశ్మీర్‌ కుంకుమ పువ్వు, అస్సాం రాయల్‌ టీ సహా పలు రాష్ట్రాలకు చెందిన 21రకాల వస్తువులు ప్రదర్శించినట్లు భారత రాయబారి వినయ్ కుమార్ వెల్లడించారు.

Updated Date - Aug 02 , 2024 | 07:01 PM

Advertising
Advertising
<