ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG News: బాబోయ్ వీరి దందా మాములుగా లేదుగా.. యువతే వీరి టార్గెట్

ABN, Publish Date - May 19 , 2024 | 05:03 PM

నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు పలు అక్రమాలకు కేంద్రంగా మారింది. రింగ్ రోడ్డు ప్రాంతం నిర్మానుషంగా ఉండటంతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్చగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రధానంగా కేయూ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ ఆర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.

వరంగల్: నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు పలు అక్రమాలకు కేంద్రంగా మారింది. రింగ్ రోడ్డు ప్రాంతం నిర్మానుషంగా ఉండటంతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్చగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రధానంగా కేయూ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ ఆర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అయితే ఇంత జరుగుతున్న పోలీసులు ఇటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ అవుటర్ రింగ్ రోడ్డుపై గంజాయి దందా, పేకాట, వ్యభిచారం ఎక్కువగా జరుగుతున్నాయి.


కొంతమంది వ్యక్తులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వ్యసనాలకు చెడుదారిలో వెళ్లేలా చేస్తున్నారు. విద్యార్థులను టార్గెట్‌గా పెట్టుకొని గంజాయి, సిగరెట్ చాక్‌లెట్, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారు. విద్యార్థులకు ఇచ్చే సిగరెట్ విలువ సుమారుగా రూ.300, చాక్‌లెట్లు రూ-100 నుంచి 200 వరకు విలువ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే చాలు అవుటర్ రింగ్ రోడ్డుపై మత్తుబాబులు దర్శనమిస్తున్నారు. గంజాయి సేవిస్తూ, ఊగుతూ కనిపిస్తున్నారు. గంజాయి కావాలనుకునే వారు ఆయా డీలర్లకు వాట్సాప్ కాల్ చేస్తే చాలు నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు.


గంజాయి సేవించే వారిలో ఎక్కువగా సంపన్నుల పిల్లలే ఉండటంతో మత్తుకోసం ఎంతయినా వెచ్చిస్తారని, పోలీసులకు పట్టుబడితే పలుకుబడిని ఉపయోగించి బయటకు రావచ్చని విక్రయిదారులు భావిస్తున్నారు. మరోవైపు ఓఆర్ ఆర్ పక్కన కమర్షియల్ కాంప్లెక్స్‌లు. ప్రైవేట్ భవనాలు ఇల్లీగల్ కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. పైకి ఇతర వ్యాపారాలు చేస్తున్నామని నేమ్ బోర్టులు పెట్టినా లోపల మాత్రం అడ్డమైన దందాలు నడుస్తున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను తీసుకొచ్చి వ్యభిచార ఊబిలో దింపుతున్నారని సమాచారం.


బడా బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు యువతులను ఎరగా వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వరంగల్ అవుటర్ రింగు రోడ్డుపై జరుగుతున్న బాగోతం బయట ప్రపంచానికి తెలిసింది. అయితే రింగ్ రోడ్డు నిర్మానుష్యంగా ఉండటం, పోలీసుల నిఘా సరిగా ఉండకపోవటంతో ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 05:12 PM

Advertising
Advertising