మండలంలో నీటిఎద్దడిని నివారిస్తాం : ఎంపీడీవో
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:24 AM
ప్లాన ఏ,బీ,సీ ప్రకారం వేసవిలో నీటి ఎ ద్దడిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని ఎంపీడీవో ఉమే్‌షచారి తెలిపారు.

మండలంలో నీటిఎద్దడిని నివారిస్తాం : ఎంపీడీవో
నార్కట్‌పల్లి, ఏప్రిల్ 19: ప్లాన ఏ,బీ,సీ ప్రకారం వేసవిలో నీటి ఎ ద్దడిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని ఎంపీడీవో ఉమే్‌షచారి తెలిపారు. మండల కేంద్రంలో తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని, నీటి ఎద్దడి ఎ దురైనా మంచినీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 85 ఓహెచఎ్‌సఆర్‌ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. సాగర్‌లో వానరాల మృత్యువాత సంఘటన నేపథ్యంలో ప్రతీ నె లా 1, 11, 21వ తేదీల్లో నీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలో నీటి సమస్య ఎదురైతే అప్పటికప్పుడే పరిష్కరించేందుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీవో తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వా డుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్, కార్యాల య పర్యవేక్షకుడు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.