ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maoist Leader: నా భర్త మృతదేహంపై తూటా గాయాల్లేవు

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:42 AM

మావోయిస్టు నేత ఏగోలాపు మల్లయ్య అలియాస్‌ మధు మృతదేహంపై ఒక్క తూటా గాయం కూడా లేదని ఆయన భార్య మీనా వెల్లడించారు.

  • చిత్రహింసలు పెట్టి చంపేశారు: మల్లయ్య భార్య మీనా

ఏటూరునాగారం రూరల్‌, పాలకుర్తి, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు నేత ఏగోలాపు మల్లయ్య అలియాస్‌ మధు మృతదేహంపై ఒక్క తూటా గాయం కూడా లేదని ఆయన భార్య మీనా వెల్లడించారు. శుక్రవారం మల్లయ్య మృతదేహాన్ని ఆయన భార్య, బంధువులు పరిశీలించి స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. మావోరుస్టులను పోలీసులు విష ప్రయోగం ద్వారా బంధీలుగా చేసి, తల పగులకొట్టి చిత్రహింసలు పెట్టి అతి కిరాతంగా చంపారని ఆరోపించారు. ఈనెల 1న ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మల్లయ్య సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం విదితమే. 2వ తేదీన ఫోరెనిక్స్‌ బృందం సమక్షంలో ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.


ఆరు మృతదేహాలను వారి బంఽధువులకు అప్పగించారు. అయితే తన భర్తను పోలీసులు హింసించి చంపారని మీనా ఈనెల 2న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో మల్లయ్య మృతదేహాన్ని మార్చురీలోనే భద్రపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం మల్లయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లాలోని రాణాపురంలో మల్లయ్య అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 04:43 AM