ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaani Master: జానీ మాస్టర్‌పై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:41 AM

సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాపై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదైంది.

  • 40 పేజీల లేఖను సమర్పించిన బాధితురాలు

  • అండగా ఉంటామన్న కమిషన్‌ చైర్‌పర్సన్‌ శారద

  • జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదుకు అవకాశం

హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌/నార్సింగ్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాపై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు బుధవారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40పేజీలతో కూడిన లేఖను బాధితురాలు సమర్పించారు. పరిగణనలోకి తీసుకున్న కమిషన్‌... ఫిర్యాదు ను స్వీకరించడంతోపాటు న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చింది. అనంతరం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అండగా మహిళా కమిషన్‌ నిలబడుతుందని, మహిళా కొరియోగ్రాఫర్‌కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.


సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ కొరియోగ్రఫీ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్‌ బాధిత మహిళను ఇబ్బంది పెట్టారని, అసోసియేషన్‌ సభ్యత్వమున్నా ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడని దుయ్యబట్టారు. కాగా, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ) రాష్ట్ర మండలి డిమాండ్‌ చేసింది. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో లైంగిక వేధింపుల ఫిర్యాదుల ప్యానల్‌ ఉన్నా మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేసింది.


కాగా, జానీ మాస్టర్‌పై నమోదైన కేసులో నార్సింగ్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతడిని పట్టుకొనేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నెల్లూరుతోపాటు ముంబై, ఢిల్లీలో ఆయన కోసం వెతుకుతున్నారు. మరోవైపు.. ఫిర్యాదుదారు మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్‌ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ కేసును పోక్సో కేసుగా మార్చే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.


  • ఇది.. లవ్‌ జిహాదే : బీజేపీ నేత శిల్పారెడ్డి

జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు.. లవ్‌ జిహాదేనని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఓ యువతిని వేధించడం, మతం మారాలని ఒత్తిడి చేయడం, దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. లైంగిక వేధింపుల కేసును తీవ్రంగా పరిగణించి.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Sep 19 , 2024 | 04:41 AM

Advertising
Advertising