ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andi Kantivesley: మహిళలకు ఉచితంగా ఈ-ఆటోరిక్షా డ్రైవింగ్‌ శిక్షణ

ABN, Publish Date - Jul 12 , 2024 | 03:22 AM

రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు.

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు. ఈ శిక్షణకు 100 మంది మహిళలకు అవకాశం కల్పించనున్నామన్నారు. శిక్షణ అనంతరం డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పించడంతో పాటు సొంతంగా ఎలక్ట్రిక్‌ వాహనం పొందేందుకు మైక్రో లోన్‌ను అందిస్తామని తెలిపారు. అవసరమైతే ఇంటర్వ్యూ చేసి, ఉద్యోగం కూడా ఇప్పించేలా సహకారం అందిస్తామన్నారు. శిక్షణ 45 నుంచి 60 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు 7660022507, 8978099499 నెంబర్‌లకు సంప్రదించవచ్చని లేదా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ‘మొవో’ ప్రాంగణంలో అధికారులను కలిసి మాట్లాడవచ్చని కాంతి వెస్లే సూచించారు.

Updated Date - Jul 12 , 2024 | 03:22 AM

Advertising
Advertising
<