Jeedimetla: రియాక్టర్ పేలి కార్మికుడి మృతి
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:23 AM
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలి బి.అనిల్‌యాదవ్(42) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
మరో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమం
జీడిమెట్ల అరోరా ఫార్మాస్యూటికల్స్‌లో ఘటన
జీడిమెట్ల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలి బి.అనిల్‌యాదవ్(42) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం ఉదయం 10గంటల సమయంలో రియాక్టర్ పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. ఆ తీవ్రతకు అనిల్‌యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోపిచంద్, శ్రీనివాస్, బలరాం అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. అనిల్‌యాదవ్ మృతదేహాన్ని తమకు చూపకుండా యాజమాన్యం గోప్యంగా వ్యవహరించిందని, పోలీసుల సాయంతో గాంధీకి తరలించిందని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇతడి స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి కాగా సూరారం కాలనీలో ఉంటున్నారు.
Updated Date - Nov 21 , 2024 | 05:23 AM