ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad City: నడి రోడ్డుపై యువకుడి నిర్వాకం.. ఏం చేశాడంటే..?

ABN, Publish Date - Aug 22 , 2024 | 06:18 PM

హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. ట్రాఫిక్ సమస్య. అలాంటి మహానగరంలో రహదారిపై ఓ వాహనం సాంకేతిక సమస్యతో ఆగిపోయిందంటే.. ఇక వాహనదారులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం ఎప్పుడో మానేసి.. వాహనదారులకు చలానాలు రాసే పనిలో వారంత నిమగ్నమైపోయారు.

హైదరాబాద్, ఆగస్ట్ 22: హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. ట్రాఫిక్ సమస్య. అలాంటి మహానగరంలో రహదారిపై ఓ వాహనం సాంకేతిక సమస్యతో ఆగిపోయిందంటే.. ఇక వాహనదారులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం ఎప్పుడో మానేసి.. వాహనదారులకు చలానాలు రాసే పనిలో వారంత నిమగ్నమైపోయారు.

Also Read: Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’


దీంతో విశ్వ నగరంలో ట్రాఫిక్‌లో చిక్కుకుని సగటు నగర జీవి పద్మవ్యూహాంలో చిక్కిన అభిమాన్యుడిలా ప్రతీ రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలాంటి మహానగరం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గురువారం యూట్యూబర్ హర్ష మరోసారి హల్‌చల్ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో నిలబడి.. గాల్లోకి భారీగా నగదు విసిరేశాడు. దీంతో ఆ నగదు పట్టుకునేందుకు రహదారిపైకి భారీగా ప్రజలు పరిగెత్తారు. అది కూడా ఇష్టానుసారం రహదారిపై పరిగెత్తారు.

Also Read: Beerla Ilaiah: ‘రైతు రుణ మాఫీ చూసి బీఆర్ఎస్ నేతల మతి భ్రమించింది’


దీంతో ప్రమాదం జరిగే అవకాశముందంటూ.. వాహనదారులతోపాటు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వీటిని రీల్స్‌గా తీసి.. వాటిని సోషల్ మీడియాలో హర్ష పోస్ట్ చేస్తున్నాడంటూ స్థానికులతోపాటు నెటిజన్లు సైతం అతడిపై ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో సైతం ఇలాగే పలుమార్లు ట్రాఫిక్‌లో నిలబడి ఇదే తీరుగా హర్ష.. గాల్లోకి నగదు వెదజల్లుతూ రీల్స్ తీశాడని నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు.

Also Read: అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు


అలాగే బైక్ స్టెంట్లు తీసి.. వాటిని సైతం యూట్యూబుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌‌ల్లో హర్ష పోస్ట్ చేస్తున్నారని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. హర్ష తన స్వలాభం కోసం.. ఇలా చేయడం వల్ల రహదారిపై ఎవరి ప్రాణాలైన పోతే.. దానికి ఎవరు బాధ్యులంటూ పోలీసులను నెటిజన్లు ఈ సందర్బంగా నిలదీస్తున్నారు. ఈ మహానగరంలో రహదారులపై ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను పోలీస్ శాఖ అమర్చిందని గుర్తు చేస్తున్నారు.


తద్వారా కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చుని.. కడుపులో నీరు కదలకుండా పోలీసు శాఖ వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. అందుకే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు రహదారులపై ఎక్కడ కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక పవర్ హర్ష అలియాస్ మహాదేవ్ ఆన్‌లైన్‌లో "its_me_power" పేరుతో అకౌంట్ ట్రాఫిక్‌కు అంతరాయాన్ని కలిగిస్తూ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నెటిజన్లు గట్టిగా కోరుతున్నారు.

Read More Telangana News and atest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 06:24 PM

Advertising
Advertising
<