ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతి

ABN, Publish Date - Oct 23 , 2024 | 05:47 AM

ఉప్పల్‌ పారిశ్రామిక వాడలోని డీఎ్‌సఎల్‌ అబాకస్‌ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతిచెందింది.

  • ఉప్పల్‌లో ఘోరం.. మృతురాలు అక్కడే ఉద్యోగిని

  • సోమవారం సాయంత్రం ఐదింటికి విధులకు హాజరు

  • తెల్లవారుజామున 2 గంటలకు ఘటన.. పలు అనుమానాలు

ఉప్పల్‌, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ పారిశ్రామిక వాడలోని డీఎ్‌సఎల్‌ అబాకస్‌ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతిచెందింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ పార్శిగుట్టలో నివసించే పిన్నపాటి రమేశ్‌ రెండో కూతురు హరిత (24) డీఎ్‌సఎల్‌ అబాకస్‌ ఐటీ భవనం తొమ్మిదో అంతస్తులోని సీఎస్‌ టెక్నాలజీలో కస్టమర్‌ రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు విధులకు హాజరయ్యే హారిక మరుసటి రోజు ఉదయం 4 గంటలకు విధులు ముగించుకొని ఇంటికి వెళతారు. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లిన హారిక మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు తాను పనిచేస్తున్న 9వ అంతస్తు నుంచి కిందకు దూకినట్లు తోటి ఉద్యోగులు గమనించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే హరిత ఎందుకు భవనంపై నుంచి దూకారన్న విషయం మాత్రం ఎవరూ చెప్పలేక పోతున్నారు. మృతురాలి తండ్రి రమేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 23 , 2024 | 05:47 AM