వంకాయ పల్లిపొడి
ABN, Publish Date - Nov 24 , 2024 | 10:21 AM
కావలసిన పదార్థాలు: వంకాయలు అర కేజీ, జీలకర్ర - ఒక టీ స్పూను, నూనె - 3 స్పూన్లు, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకు - 4 రెబ్బలు, ఎండుమిర్చి - ఒకటి, పల్లీలు - ఒకటిన్నర టీ స్పూన్లు, పుట్నాలు - ఒక టీ స్పూను, నువ్వులు - అర టీ స్పూను, వెల్లుల్లి - రెండు రేకలు, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - పావు టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, కొత్తిమీర తరుగు - గుప్పెడు.

తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి, జీలకర్ర వేగించి ఉల్లి తరుగు, తుంచిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు దోరగా వేగించాలి. తర్వాత పొడుగ్గా తరిగిన వంకాయ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు చల్లి మూతపెట్టాలి. ఈలోపు మిక్సీలో వేగించిన పల్లీలు, పుట్నాలు, నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు బరకగా పొడి చేసుకోవాలి. వంకాయలు 80 శాతం మగ్గిన తర్వాత పసుపు, కారం కలిపి మరో రెండు నిమిషాలు ఉంచాలి. దించేముందు పల్లీ మిశ్రమం, కొత్తిమీర చల్లాలి. రొటీన్‌కు భిన్నంగా ఉండే ఈ వేపుడు కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
Updated Date - Nov 24 , 2024 | 10:21 AM