ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాదీ చికెన్‌ గ్రేవీ

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:34 AM

కావలసిన పదార్థాలు: చికెన్‌ - 1.25 కేజీలు, నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి, కారం - 1.5 టేబుల్‌ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబుల్‌ స్పూన్లు, పెరుగు - ఒక కప్పు, నూనె - పావు కప్పు, సాజీరా - అరటీ స్పూను, యాలకులు - 4, లవంగాలు - 5, దాల్చిన చెక్క - రెండంగుళాలు, నూనెలో వేగించిన ఉల్లితరుగు - అరకప్పు, మిరియాల పొడి - ఒక టీ స్పూను, కొత్తిమీర - గుప్పెడు, పచ్చిమిర్చి -

తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చికెన్‌లో నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, పెరుగు (పుల్లగా ఉండరాదు) వేసి బాగా కలిపి కనీసం రెండు గంటలు పక్కనుంచాలి. తర్వాత కడాయిలో నూనె వేసి సాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క వేగించి చికెన్‌ కలిపి రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి మీడియం మంటపై చికెన్‌ 80 శాతం ఉడికించాలి. తర్వాత ఉల్లితరుగు కలిపి మరో 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు వేసి గ్రేవీ పూర్తిగా చిక్కబడిన తర్వాత దించి సర్వ్‌ చేయాలి. అటు బగారా రైస్‌, ఇటు చపాతీల్లోకి కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది.

Updated Date - Dec 22 , 2024 | 10:34 AM