Weekend Comment By RK: వైఎస్ జగన్ పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది..!?
ABN, Publish Date - Jul 27 , 2024 | 06:05 PM
జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది?.. జగన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎందుకు తేడాగా ఉంటాయి?.. జగన్ రెడ్డి జిత్తుల్ని చంద్రబాబు అంచనా వేయలేకపోయారా?.. ఢిల్లీలో జగన్ ప్రచారం చేసిన అబద్ధాలను ఎవరు నమ్ముతారు?
బాబూ.. ఆ తప్పు గ్రహించారా..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలను..
ఆయన ప్రత్యర్థులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు..?
సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడ్డ చంద్రబాబు..
జగన్ జిత్తుల్ని అంచనా వేయడంలో విఫలమయ్యారా..?
ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన జగన్ పనైపోయిందని..
ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉంటుందా..?
జగన్ రెడ్డిని తేలికగా తీసుకుని 2019లో బొక్కబోర్లా పడిన..
చంద్రబాబు ఇప్పటికైనా ఆ తప్పును గ్రహించారా..?
ఎందుకిలా..?
అబద్దాల మొనగాడు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా..
కూటమి ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారం ప్రభావమెంత..?
చంద్రబాబు నెల రోజుల పాలనలో 36 మంది హత్యకు..
గురయ్యారని జగన్ పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలిగారు..?
చంద్రబాబులో తెంపరితనం ఉండదన్న నమ్మకంతోనే..
ఈ తరహా శవ రాజకీయాలకు జగన్ తెగబడుతున్నారా..?
భారీ విజయంతో ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని..
నెల రోజులకే రద్దు చేయాలని కోరడం విపరీత బుద్ధి కాదా..?
ప్రజలే నిరాకరించిన ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం..
జగన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంలో ఔచిత్యం ఉందా..?
అప్రమత్తం కాకపోతే..?
అధికారం కోసం ధనం, ధనం కోసం అధికారం అని నమ్మే జగన్..
శాసనసభకు హాజరవడం టైం వేస్ట్ అని భావిస్తున్నారా..?
పది ఎన్నికలు చూశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు..
జగన్ విషయంలో అప్రమత్తం కాకపోతే ఏం జరుగుతుంది..?
రాజధాని అమరావతికి కేంద్రం ప్రకటించిన..
రూ. 15వేల కోట్ల సాయంపైనా జగన్ అండ్ కో ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది..?
జగన్ ట్రాప్‌లో పడి గతంలో ప్రత్యేక ప్యాకేజీని వదులుకున్న..
చంద్రబాబు ఈసారైనా కేంద్ర సాయాన్ని రాబట్టుకుంటారా..?
పీకల్లోతు కేసుల్లో ఉన్న జగన్.. ప్రధాని మోదీని ఎదిరించి..
ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే సాహసం చేస్తారా..?
వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ..
రాత్రి 8:30 గంటలకు దమ్మున్న మీ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో
Updated Date - Jul 27 , 2024 | 06:24 PM