శ్రీకాకుళం కొత్తఎస్పీ.. సోషల్ మీడియాలో ఎందుకంత వైరల్
ABN, Publish Date - Jul 24 , 2024 | 06:37 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఆ క్రమంలో ఉత్తరాంద్రలోని శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి. మహేశ్వర్ రెడ్డిని నియమించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఆ క్రమంలో ఉత్తరాంద్రలోని శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి. మహేశ్వర్ రెడ్డిని నియమించింది. ఆయనకు నిండా 30 ఏళ్లు కూడా లేవు. దీంతో ఆయన గురించి చర్చ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కడప జిల్లాలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహేశ్వర్ రెడ్డి పిన్న యవస్సులోనే.. అంటే 2019లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
Also Read: Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్
Also Read: Telangana Assembly: ‘అయ్యేదుంటే సీఎం కావచ్చు’
Also Read: jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు
Also Read: AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన
Also Read: AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్
అనంతరం ఆయన చిత్తూరు ఏఎస్పీగా, విశాఖపట్నంలో గ్రేహౌండ్‌లో విధులు నిర్వహించారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. మహేశ్వర్ రెడ్డి చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించారనే ప్రచారం ప్రజల్లో బలంగా నెలకొంది. అదీకాక చంద్రబాబు ప్రభుత్వం తాజాగా చేపట్టిన బదిలీల్లో యువ ఐఏఎస్, ఐపీఎస్‌లను జిల్లా ఉన్నతాధికారులుగా నియమించారు. అదీకాక జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. జిల్లాలో శాంతి భద్రతలపై ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 24 , 2024 | 06:37 PM