మంచు ఫ్యామిలీలో గొడవలు.. పోటాపోటీగా బౌన్సర్ల మోహరింపు
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:46 PM
మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్‍పై ఆదివారం దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అతడు హైదరాబాద్‍లోని బంజారాహిల్స్‍లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానీ పరిస్థితి నెలకొంది. మరోవైపు మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఇప్పటికే దుబాయి నుంచి హైదారబాద్ తిరిగి వచ్చారు. మరికాసేపట్లో జల్‍పల్లిలోని నివాసానికి ఆయన చేరుకోనున్నారు.
మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్‍పై ఆదివారం దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అతడు హైదరాబాద్‍లోని బంజారాహిల్స్‍లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానీ పరిస్థితి నెలకొంది. మరోవైపు మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఇప్పటికే దుబాయి నుంచి హైదారబాద్ తిరిగి వచ్చారు. మరికాసేపట్లో జల్‍పల్లిలోని నివాసానికి ఆయన చేరుకోనున్నారు. మంచు విష్ణు.. రానుడండడంతో.. జల్‍పల్లిలోని నివాసానికి భారీగా చేరుకున్న బౌన్సర్లు. పోటీగా బౌన్సర్లను రప్పించిన మంచు మనోజ్. ఇక ఆళ్లగడ్డ నుంచి మంచు మనోజ్ కు మద్దతుగా ఇప్పటికే ఆయన ఇంటికి చేరుకున్నారు. మంచు విష్ణు వస్తుండడంతో.. జల్‍పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇంకోవైపు మోహన్ బాబు నివాసం వద్దకు లేడీ బౌన్సర్లు సైతం చేరుకున్నారు. అయితే ఈ వివాదానికి వినయ్ అనే వ్యక్తి కేంద్ర బిందువుగా మారాడు. ఎంబియూ, విద్యానికేతన్ విద్యాసంస్థల్లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 09 , 2024 | 04:46 PM