హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

ABN, Publish Date - Jul 25 , 2024 | 07:41 AM

అమరావతి: విజయవాడలో ఉన్న వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ తెచ్చిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల సభ్యులు బలపరిచారు.

అమరావతి: విజయవాడలో ఉన్న వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University)ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (Dr. NTR Health University)గా మారుస్తూ తెచ్చిన బిల్లును రాష్ట్ర శాసనసభ (AP Assembly) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) ప్రవేశపెట్టిన ఈ బిల్లును టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల సభ్యులు బలపరిచారు. వెంటనే పేరు మార్చాలని కోరడంతోపాటు తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టాలని.. యూనివర్సిటీ ఏర్పాటుకు ఆయనే ఆధ్యులని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. దీంతో విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌గా మారుస్తూ సవరణ బిల్లును అసెంబ్లీ ఏక గ్రీవంగా ఆమోదించింది. దాంతో సభ్యులు బల్లలపై చరుస్తూ హర్షం వెలిబుచ్చారు.


ఎన్టీ రామారావు అంటేనే ఒక బ్రాండ్‌ అని, ఆయన పేరును హెల్త్‌వర్సిటీకి తొలగించి వైఎస్ఆర్ పేరు చేర్చడం దుర్మార్గమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌కు కులం అపాదించిన మొదటి వ్యక్తి జగనే అని మండిపడ్డారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపును నిరసిస్తూ విజయవాడ నగరంలో విద్యార్ధులు, యువకులు, 70-80 ఏళ్ల వృద్ధులు, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని, వారిపై జగన్‌ సర్కారు అక్రమ కేసులు పెట్టిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ కేసులను రద్దుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


నాడు విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చుతూ జగన్ ప్రభుత్వం 2022లో నిర్ణయం తీసుకుంది. ఆనాడు సర్కారు తీర్మానం చేయగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా మార్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పేరు మార్పుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు మండిపడ్డారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఐ నేత రామకృష్ణ కూడా ఆరోగ్య యూనివర్సిటీ పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వ్యవస్థలను కుప్పకూల్చారు!

పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్‌’

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 25 , 2024 | 07:41 AM