రోజమ్మ నీకో న్యాయం..మాకో న్యాయమా ..
ABN , Publish Date - Nov 07 , 2024 | 04:46 PM
టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళా నేతలపై వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరకర పోస్టుల చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆ రెండు పార్టీలకు చెందిన మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమిలోని పార్టీల మహిళలపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఈ విధంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందంటూ వారు మండి పడుతున్నారు. ఈ తరహా పోస్టులకు పాల్పడిన వారిని సుమోటో కింద వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే వైసీపీ నేతలు బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్‌రెడ్డి అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నేతలు ఎండగట్టారు. ఇక ఏపీ హోం మినిస్టర్ అనితపై నేటికి సోషల్ మీడియా వేదికగా పోస్టులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలతోపాటు తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..