Visakha: రూ. 25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రైల్వే అధికారి..
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:46 PM
ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎమ్‌గా పనిచేస్తున్న సౌరభ్ కుమార్ ప్రసాద్ అవినీతి కేసులో పట్టుబడ్డారు...
విశాఖ: సీబీఐ (CBI) వలలో మరో అవినీతి చేప చిక్కింది. విశాఖ వాల్టేర్ రైల్వే డీఆర్ఎమ్ (Visakha Waltair Railway DRM) సౌరభ్ కుమార్ ప్రసాద్ (Saurabh Kumar Prasad) లంచం (Bribe) తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. రూ. 25 లక్షలు (Rs. 25 lakhs) లంచం తీసుకుంటుంగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకునేందుకు ముంబై వెళ్లిన ఆయనను అక్కడే పట్టుకున్నారు. సీబీఐకు చిక్కిన డీఆర్ఎమ్ జాబితాలో రెండో డీఆర్ఎమ్‌గా సౌరభ్ కుమార్ ప్రసాద్ నిలిచారు.
సౌరభ్ కుమార్ ప్రసాద్‌కు సంబంధించి సీబీఐ అధికారులు నిన్నటి నుంచి (శనివారం) మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. 1. ముంబై, 2. విశాఖలోఆయన ఉంటున్న బంగ్లా., 3. ఆయన కార్యాలయం. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకు అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ఘటన రైల్వే వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు సీబీఐకు చిక్కిన ఇద్దరు డీఆర్ఎమ్‌లలో ఒకరు పునీత్ సింగ్ గుంతకల్ రైల్వే డీఆర్ఎమ్.. ఇప్పుడు తాజాగా విశాఖ రైల్వే డివిజన్‌కు చెందిన సౌరభ్ కుమార్ ప్రసాద్. అయితే ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సీబీఐ అధికారులు సౌరబ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది.
కాగా విశాఖలోని సౌరభ్ కుమార్ ప్రసాద్ బంగ్లాలో సీబీఐ అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. బయట వ్యక్తులు ఎవరినీ పోలీసులు లోపలకు వెళ్లనీయలేదు. తనిఖీల సమయంలో డీఆర్‌ఎమ్ ఇంట్లో లేరు. రెండు రోజుల క్రితం ఆయన పట్నా వెళ్లినట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమీన్ పీర్ ఉత్సవాల్లో ఏఆర్ రెహమాన్
విశాఖ స్టీల్ ఫ్లాంట్.. రూ. 3 వందల కోట్ల నష్టం..
వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు
కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News