Video Viral: తండ్రి చేతిలో బిడ్డ ‘ప్రాణం’
ABN, Publish Date - Jun 19 , 2024 | 02:41 PM
నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన తపనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా, కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణీని కుటుంబ సభ్యులు.. మంగళవారం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేర్పించారు.

నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన తపనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా, కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణీని కుటుంబ సభ్యులు.. మంగళవారం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేర్పించారు. నెలలు నిండకుండానే శిరీష.. బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నవజాత శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. ఆ క్రమంలో ఆ శిశువుకు ఆక్సిజన్ పెట్టి.. ఎన్ఐసీయూకు బయలుదేరారు.
అయితే ఆక్సిజన్ సిలిండర్ తీసుకు వెళ్లేందుకు ఆ సమయంలో ఆసుపత్రిలో సిబ్బంది లేరు. ఈ నేపథ్యంలో శిశువును నర్స్ ఎత్తుకొని ముందుకు నడుస్తుంటే.. ఆ బిడ్డ తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని వెనుక నడిచారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేజీహెచ్ ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు. ఇలా ఎందుకు జరిగిందంటూ.. వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందికి ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
Updated at - Jun 19 , 2024 | 02:42 PM