At Home: రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. సీఎంతో డిప్యూటీ సీఎం ముచ్చట్లు

ABN, Publish Date - Aug 15 , 2024 | 07:55 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం విజయవాడలో ఉన్న ఏపీ రాజ్‌భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజాప్రతినిధులకు తేనీటి విందు ఇచ్చారు.

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం విజయవాడలో ఉన్న ఏపీ రాజ్‌భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజాప్రతినిధులకు తేనీటి విందు ఇచ్చారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జీలు తదితరులు హాజరయ్యారు.

Updated Date - Aug 15 , 2024 | 07:55 PM

Advertising
Advertising