ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ప్రధాని జీతంపై సర్వత్రా చర్చ.. నెలకు ఎంతంటే..?

ABN, Publish Date - Jun 12 , 2024 | 07:53 PM

ప్రధాని మోదీకి నెలకు రూ.1.66 లక్షల జీతం అందుతుంది. బేసిక్ పే రూ.50 వేలు ఉంటుంది. ఖర్చుల కోసం రూ.3 వేలు ఇస్తారు. పార్లమెంటరీ భత్యం రూ.45 వేలు ఉంటుంది. దినసరి భత్యం రూ.2 వేలు అందజేస్తారు. మొత్తంగా రూ.60 వేలు అందుతాయి.

pm modi

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జీతం ఎంత ఉంటుంది..? ఇతర సదుపాయాలు ఏం ఉంటాయి..? ఏ వాహనం అయినా వినియోగించొచ్చా..? ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో ఖర్చులు ఎలా జరుగుతాయి..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సగటు జీవి మెదడును తొలచి వేస్తున్నాయి. మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టడంతో జీతం, భత్యాలపై చర్చ జరుగుతోంది.


జీతం ఎంత అంటే..?

ప్రధాని మోదీకి నెలకు రూ.1.66 లక్షల జీతం అందుతుంది. ఇది భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వేతనం కన్నా తక్కువ. ప్రధాని వేతనానికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే.. బేసిక్ పే రూ.50 వేలు ఉంటుంది. ఖర్చుల కోసం రూ.3 వేలు ఇస్తారు. పార్లమెంటరీ భత్యం రూ.45 వేలు ఉంటుంది. దినసరి భత్యం రూ.2 వేలు అందజేస్తారు. మొత్తంగా రూ.60 వేలు అందుతాయి. పదవిలో ఉన్న సమయంలో నివాసం, మంచినీరు, విద్యుత్, భద్రత అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. ప్రధాని కోసం స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎస్పీజీ) విధుల్లో ఉంటారు. ప్రధాని పదవి దిగాక కూడా ఐదేళ్ల పాటు ఎస్పీజీ భద్రతా విభాగం సెక్యూరిటీ అందజేస్తుంది.


వసతి

ప్రధానమంత్రి ఏ ప్రభుత్వ వాహనం అయినా ఉపయోగించే వెసులుబాటు ఉంది. వాజ్‌పేయి కన్నా ముందు అందరూ అంబాసిడర్ కారు వాడారు. ఆ సంస్కృతికి వాజ్ పేయి తెరదించారు. బీఎండబ్ల్యూ కారు వినియోగించారు. అప్పటినుంచి ప్రధానమంత్రులు బీఎండబ్ల్యూ కార్లను వాడుతున్నారు. ప్రధాని కోసం ప్రత్యేక విమానాలు అందుబాటులో ఉంటాయి. విదేశీ పర్యటనల సమయంలో వసతి, ఆహారం, ప్రయాణ ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఉచితంగా వసతి, విద్యుత్, మంచినీరు లాంటి సదుపాయాలు ఉంటాయి.

Updated Date - Jun 12 , 2024 | 07:53 PM

Advertising
Advertising