Harish Rao: దొంగే దొంగ అన్నట్లు రేవంత్ వ్యవహారశైలి.. హరీశ్ మండిపాటు
ABN, Publish Date - Aug 17 , 2024 | 07:39 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీకి ఎగనామం పెట్టి మొత్తం రుణాలు మాఫీ చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. ‘‘పాక్షికంగా చేసిన.. తప్పైంది అని క్షమాపణ చెప్పు. నోరు బిగ్గరగా చేసినంత మాత్రాన నిన్ను బీఆర్ఎస్ వదిలి పెట్టదు. కేబినెట్‌లో రూ.31వేల కోట్లు అన్నారు. బడ్జెట్‌లో రూ.26వేల కోట్లు పెట్టారు. తీరా రూ.17 వేల 933 కోట్లు మాత్రమే ఇచ్చి 22లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. రూ.14వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ పూర్తి అయ్యింది అంటున్నారు. రైతుల సంఖ్య 47లక్షలు అని చెప్పి 22లక్షల మంది రైతులకు మాత్రమే చేశారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. టైం చెప్తే నేనే వస్తా. ఎక్కడైనా చర్చకు సిద్ధం’’ అని హరీష్ సవాలు విసిరారు.
Updated Date - Aug 17 , 2024 | 07:40 PM