PM Modi: ఎన్డీఏ పక్ష నేతగా మోదీ.. ప్రతిపాదించిన రాజ్నాథ్ సింగ్
ABN, Publish Date - Jun 07 , 2024 | 12:27 PM
లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ (Modi) పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీఏ లోక్ సభ పక్ష నేతగా మోదీని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ పక్ష నేతలు కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను అందజేస్తారు. ఉదయం 11.30 గంటలకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు నితీశ్ కుమార్, పవన్ కల్యాణ్, అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు. ఎన్డీఏ పక్ష ఎంపీలు కూడా హాజరయ్యారు.
Updated Date - Jun 07 , 2024 | 01:16 PM