Video Viral: పిన్నెల్లి ఎక్కడున్నా ఈడ్చుకొస్తారు ..!
ABN, Publish Date - May 22 , 2024 | 07:39 PM
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

దీంతో భయపడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ఆయన సోదరుడు అజ్జాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్.. మాచర్ల నియోజకవర్గ ప్రజలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడు, సౌమ్యుడు అంటూ పరిచయం చేయడంతోపాటు ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలంటూ ప్రజలకు సూచించారు.
పిన్నెల్లి గురించి పార్టీ అధినేత వైయస్ జగన్ ఇలా చెప్పడం.. పోలింగ్ కేంద్రంలో అదే పిన్నెల్లి అలా వ్యవహరించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంతే కాదు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా వ్యవహరించారో అందరు చూశారు. అలాగే పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి వ్యవహారాన్ని అడ్డుకొనేందుకు వెళ్లిన టీడీపీ శ్రేణులపై వైసీపీ వాళ్లు తమ మాటలతో ఎలా ఎదురు దాడి చేశారన్నది కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
దీంతో ఈ కేసులో పిన్నెల్లికి బలంగా శిక్ష పడే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం సాగుతుంది. ఇంకోవైపు భవిష్యత్తులో పోలింగ్ కేంద్రాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసీ కఠిన చర్యలు చేపట్టే అవకాశముందనే వాదన సైతం బలంగా వినిపిస్తుంది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 22 , 2024 | 08:49 PM