ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rewind 2024: బాల్ ఆఫ్ ది ఇయర్.. బుమ్రా కెరీర్‌లోనే బెస్ట్ డెలివరీ

ABN, Publish Date - Dec 31 , 2024 | 08:45 PM

Jasprit Bumrah: ఈ ఏడాది భారత క్రికెట్‌లో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చింది. టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకుంది. మరెన్నో స్టన్నింగ్ విక్టరీస్ నమోదు చేసింది. అదే సమయంలో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పీక్‌కు కూడా ఈ సంవత్సరం వేదికగా నిలిచింది.

Jasprit Bumrah

Sports Rewind 2024: ఈ ఏడాది భారత క్రికెట్‌లో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చింది. టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకుంది. మరెన్నో స్టన్నింగ్ విక్టరీస్ నమోదు చేసింది. అదే సమయంలో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పీక్‌కు కూడా ఈ సంవత్సరం వేదికగా నిలిచింది. ప్రతి ప్లేయర్‌ కెరీర్‌లో ఒక బెస్ట్ టైమ్ ఉంటుంది. బుమ్రా ఇప్పుడు సరిగ్గా అదే దశలో ఉన్నాడు. బ్యాక్ ఇంజ్యురీ తర్వాత కొన్నాళ్లు క్రికెట్‌కు గేమ్‌కు దూరమైన ఈ భీకర పేసర్.. కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఒక దాన్ని మించి మరో సెన్సేషనల్ స్పెల్‌తో జెంటిల్మన్ గేమ్‌ను శాసిస్తున్నాడు. అతడు వేసిన ఓ బ్యూటిఫుల్ డెలివరీ బాల్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఆ బంతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


పాములా వచ్చి పడగొట్టింది

ఈ ఏడాది ఇంటర్నేషనల్‌లో క్రికెట్‌లో చాలా మంది బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే ఎన్ని డెలివరీస్ ఉన్నా అవి దీని ముందు దిగదుడుపేనని చెప్పాలి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓలీ పోప్‌కు ఒక స్టన్నింగ్ యార్కర్ వేశాడు బుమ్రా. ఆఫ్ సైడ్ నుంచి పాము మాదిరిగా గాల్లో మెలికలు తిరుగుతూ వచ్చిన బంతి.. పోప్ బ్యాట్‌ను దాటుకొని వెళ్లి వికెట్లను చెల్లాచెదురు చేసింది. దెబ్బకు స్టంప్స్ లేచి దూరంగా పడిపోయాయి. బెయిల్స్‌ను అయితే వెతుక్కోవాల్సిన పరిస్థితి. రెండు వికెట్లు, బెయిల్స్ లేచి ఎక్కడో పడటం, బంతి తన బ్యాట్‌ను దాటి క్లీన్‌బౌల్డ్ కావడం, డిఫెన్స్ చేయబోయి బ్యాలెన్స్ తప్పడంతో ఇంగ్లండ్ బ్యాటర్ నేల వైపు చూస్తూ కన్‌‌ఫ్యూజన్‌లో అలాగే ఉండిపోయాడు.


షాకింగ్ డిస్మిసల్

బుమ్రా బంతి వేయడం, అది తన బ్యాట్‌ను దాటడం మాత్రమే అతడికి గుర్తుంది. ఆ తర్వాత జరిగిన విధ్వంసాన్ని ఓలీ పోప్‌ నమ్మలేకపోయాడు. ఏం జరిగిందంటూ బిత్తరపోయాడు. ఆ తర్వాత కోలుకొని ఎలా మిస్ అయ్యానని తలచుకుంటూ పెవిలియన్ దిశగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. పోప్ డిస్మసల్‌ను అతడే కాదు.. డ్రెస్సింగ్ రూమ్‌లోని ఇంగ్లీష్ టీమ్, మ్యాచ్‌ను తిలకిస్తున్న ఆ జట్టు అభిమానులు నమ్మలేకపోయారు. ఆ సిరీస్ నుంచి బౌలింగ్ విధ్వంసం స్టార్ట్ చేసిన బుమ్రా.. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కంటిన్యూ అవుతోంది. ఎక్కడ ఆడుతున్నాం? ఎవరితో ఆడుతున్నాం? క్రీజులో ఉన్నది ఎవరు? లాంటివి పట్టించుకోకుండా మ్యాజికల్ స్పెల్స్ వేస్తున్న బుమ్రా.. పోప్‌ డిస్మిసల్‌తో బాల్ ఆఫ్ ది ఇయర్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

జైస్వాల్ ఔట్.. దద్దరిల్లిన స్టేడియం.. ‘బాహుబలి’ని తలపించే సీన్

తెలుగోడ్ని నమ్మని రోహిత్.. పాపం సెంచరీ కొట్టినా..

మ్యాచ్ పోయినా రివేంజ్ కంప్లీట్.. స్లెడ్జింగ్‌కు భయపడేలా చేశాడుగా..

టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..

అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. టార్గెట్ చేసి మరీ చితకబాదాడు

For More Sports And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 08:51 PM