Share News

Ujjwala Scheme Expansion: పీఎం ఉజ్వల్‌లోకి 65 లక్షల మంది

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:08 AM

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 65.40 లక్షల మంది రాష్ట్రానికి దీపం 2 పథకాన్ని అందించాలన్న నిర్ణయం. ఏడాదికి 587 కోట్ల సబ్సిడీ రాష్ట్రానికి వచ్చేందుకు అవకాశం

Ujjwala Scheme Expansion: పీఎం ఉజ్వల్‌లోకి 65 లక్షల మంది

  • రాష్ట్రానికి ఏటా 587 కోట్ల సబ్సిడీ: మంత్రి మనోహర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రధా న మంత్రి ఉజ్వల యో జన కింద రాష్ట్రంలోని 65.40 లక్షల మందిని దీపం2 పథకం లబ్ధిదారులుగా చేర్చే అవకా శం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నా దెండ్ల మనోహర్‌ చెప్పా రు. ఈ విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీ్‌పసింగ్‌పూరితో చర్చించగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఫలితంగా దీపం-2 పథకంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.587 కోట్లు సబ్సిడీ రూపంలో వస్తాయన్నారు. మంగళవారం కేంద్ర మంత్రులు హర్‌దీ్‌పసింగ్‌పూరి, ప్రహ్లాద్‌ జోషితో నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో మాట్లాడారు. పీడీఎస్‌, టెక్నాల జీ వినియోగం, ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యంలో తేమశాతం అధికంగా ఉండటం తదితర అంశాలపై ప్రహ్లాద్‌ జోషితో చర్చించినట్టు చెప్పారు. భారత్‌ రైస్‌, భారత్‌ దాల్‌, తదితర ఉత్పత్తుల మార్కెటింగ్‌పై మంత్రితో చర్చించానన్నా రు. ఇతర దేశాలకు బియ్యం ఎగుమతికి అవకాశం కల్పిస్తామని జాతీయ వినియోగదారుల సంస్థ ఎండీ జోసఫ్‌ హామీ ఇచ్చారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 06:09 AM