Share News

తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:51 AM

గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తప్పిపోయిన 7 ఏళ్ల బాలుడిని గుర్తించి గవర్నర్‌పేట పోలీసులు సోమవారం తల్లికి అప్పగించారు.

తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు

వన్‌టౌన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తప్పిపోయిన 7 ఏళ్ల బాలుడిని గుర్తించి గవర్నర్‌పేట పోలీసులు సోమవారం తల్లికి అప్పగించారు. హైదరాబా ద్‌ బోడుప్పల్‌లో మురళీకృష్ణ కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. భార్య మహాలక్ష్మి, కుమారుడు నివియంక్‌ (7)తో కలిసి గొల్లపూడిలోని బంధువుల గృహప్రవేశానికి రెండ్రోజుల క్రితం వచ్చాడు. సోమవారం నివియంక్‌ నూతన అపార్టుమెంట్‌లో ఆడుకుంటూ కిందకు దిగి అడ్రస్‌ తెలియక అటూ, ఇటూ తిరుగుతున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి అత డిని గమనించి బాలుడిని వివరా లు అడిగి తెలుసుకోగా అటు ఇటూ తిప్పుడూ గవర్నర్‌పేట సౌత్‌ ఇండియా మాల్‌ వరకు తీసుకువచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి బాలుడిని సమీపంలో ఉన్న గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బాలుడిని వివరాలు అడగ్గా తండ్రిపేరు ము రళీకృష్ణ, తల్లిపేరు మహాలక్ష్మి అని తా ను బోడుప్పల్‌లో కృష్ణవేణి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్నట్టు వివరాలు చెప్పాడు. గొల్లపూడిలో బంధువుల ఇంటికి వచ్చినట్టు చెప్పాడు. పోలీసులు భవానీపురం పోలీసులకు బాలుడి ఫొటో పంపించి ఆరా తీశారు. బాలుడి మిస్సింగ్‌ కేసు ఏమీ రాలేదనటంతో గవర్నర్‌పేట పోలీసులు విజయవాడ పోలీసుల గ్రూప్‌లో బాలుడి ఫొటో పెట్టి వివరాలు తెలిస్తే తెలియజేయమని పెట్టారు. అప్పటికే గొల్లపూడిలో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు నివియాంక్‌ కోసం వన్‌సెంటర్‌ ప్రాంతంలో వెతుకుతుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వివరాలు అడిగారు. ఆ కానిస్టేబుల్‌ తన ఫోన్‌ గ్రూప్‌లో వచ్చిన బాలుడి ఫొటో చూపించటంతో వారు తమ బాబేనని చెప్పారు. కానిస్టేబుల్‌ వారిని గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌కు పంపించారు. గవర్నర్‌పేట సీఐ నాగ మురళి బాలుడి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకుని బాలుడిని వారికి అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 01 , 2025 | 12:51 AM