Amaravati: అమరావతి 2.0 టెండర్లు ఖరారు
ABN, Publish Date - Mar 14 , 2025 | 04:08 AM
అమరావతి పునర్నిర్మాణ పనుల్లో మరో అడుగు ముందుకు పడింది. వైసీపీ హయాంలో నిలిచిపోయిన భవనాలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులను మళ్లీ చేపట్టి పూర్తి చేయడం...

ఎల్1గా నిలిచిన సంస్థలకు ఎల్‌ఓఏలు.. పనుల ప్రారంభానికి సిద్ధం
విజయవాడ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అమరావతి పునర్నిర్మాణ పనుల్లో మరో అడుగు ముందుకు పడింది. వైసీపీ హయాంలో నిలిచిపోయిన భవనాలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులను మళ్లీ చేపట్టి పూర్తి చేయడం... కొత్తగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఆర్డీయే టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో అర్హత సాధించి ఎల్1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్(ఎల్ ఓఏ) ఇవ్వటం ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయా సంస్థలు పనులు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఐఏఎస్ టవర్లను పూర్తిచేసే కాంట్రాక్టు ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. మంత్రులు, జడ్జిల బంగళాలకు పిలిచిన టెండర్లలో బీఎ్‌సఆర్ ఇన్ర్ఫాటెక్ ఇండియా లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. కార్యదర్శుల బంగళాలను పూర్తి చేసే కాంట్రాక్టును కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది.
ఎల్‌పీఎస్ జోన్ల అభివృద్ధికి పిలిచిన టెండర్లను బీఎ్‌సఆర్, ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్, మేఘా, బీఎ్‌సఆర్, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ సంస్థలు దక్కించుకున్నాయి. ఇక...హ్యాపీనెస్ట్ కాంట్రాక్టు ఎన్‌సీసీకి దక్కింది. కాగా, అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో మిగిలిన రహదారి పనులకు సంబంధించిన ట్రంక్ ఇన్ర్ఫాస్ట్రక్చర్, స్ర్టామ్ వాటర్ డ్రెయిన్స్, వాటర్ సప్లై నెట్‌వర్క్, సీవరేజి నెట్‌వర్క్, యుటిలిటీ డక్ట్స్, రీ యూజ్ వాటర్ లైన్స్, నడకదారులు, సైకిల్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్ర్టీట్ ఫర్నిచర్ వంటి పనులకు రూ.4313.78 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. వీటికోసం 41 కాంట్రాక్టు సంస్థల నుంచి బిడ్లు పడ్డాయి. ఆయా పనులను ఎంవీఆర్‌ఐఎల్, ఎన్‌సీసీ, బీఎ్‌సఆర్, ఆర్‌వీఆర్, మేఘా సంస్థలు దక్కించుకున్నాయి.
Updated Date - Mar 14 , 2025 | 04:08 AM