SP RATNA: నవమి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోండి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:21 AM
జిల్లా వ్యాప్తంగా శ్రీరామినవమి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న కోరారు. శుక్రవారం మండలంలోని కరావులపల్లి తండా వద్ద ఉన్న శివ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నవమి సందర్భంగా ఎడ్లబండ్లపోటీలు నిర్వహిస్తున్నారు.

గోరంట్ల, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శ్రీరామినవమి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న కోరారు. శుక్రవారం మండలంలోని కరావులపల్లి తండా వద్ద ఉన్న శివ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నవమి సందర్భంగా ఎడ్లబండ్లపోటీలు నిర్వహిస్తున్నారు. వేడుకలలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మంత్రి సంజయ్‌రాథోడ్, రాష్ట్ర మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి, పలువురు ఐఏఎస్, ఐపీఎ్‌సలు హాజరువుతున్నారు. ఏర్పాట్లపై ఎస్పీ ఆలయ ప్రాంతాన్ని సందర్శించి హెలిప్యాడ్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. డ్రోన కేమేరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎడ్లబండ్ల పోటీలో ఆలయ ధర్మకర్త శంకర్‌లాల్‌నాయక్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఆమెతోపాటు తహసీల్దార్ మారుతి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, బాలసుబ్రమణ్యంరెడ్డి, సీఐ శేఖర్ పాల్గొన్నారు.