Handreeniva హంద్రీనీవాతో కరువుకు చెక్
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:20 AM
‘హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు పూర్తి అయితే నియోజకవర్గంలోని 193 చెరువులు, రెండు రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపవచ్చు. దీంతో కరువు పోయి.. ఈ ప్రాంతం కూడా కోస్తాంధ్రగా పాడిపంటలతో కళకళలాడుతుంది.’ అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు.

కొత్తచెరువు ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ‘హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు పూర్తి అయితే నియోజకవర్గంలోని 193 చెరువులు, రెండు రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపవచ్చు. దీంతో కరువు పోయి.. ఈ ప్రాంతం కూడా కోస్తాంధ్రగా పాడిపంటలతో కళకళలాడుతుంది.’ అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. మండలంలోని పోతులకుంట గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను సోమవారం భూమిపూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 68 కిలో మీటర్ల హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను రూ.425 కోట్లతో చేపడుతున్నామన్నారు. ఈ ప్రాంతానికి ప్రస్తుతం 1200 క్యూసెక్కుల నీరు మాత్రమే అందుతున్నాయని, ఈ లైనింగ్ పనులు పూర్తీ అయితే 2000 క్యూసెక్కుల నీరు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, ఇరిగేషన ఎస్‌ఈ తాజాస్వరూప్, ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్‌వీఆర్‌ఎండీ రాయల్‌రఘు పాల్గొన్నారు.