ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి ఆత్మహత్య..

ABN, Publish Date - Jan 05 , 2025 | 08:05 AM

గత జగన్ ప్రభుత్వ పాలనలో ఆర్ డబ్ల్యు ఎస్, ఏపీ ఐఐసీ పరిధిలో రూ.6 కోట్ల కాంట్రాక్టు పనులు జనార్దన్ రెడ్డి చేశారు. పనుల కోసం తెలిసిన వారి నుంచి రూ.4.5 కోట్ల అప్పు చేశాడు. రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో వుండటంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కాంట్రాక్టర్.. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం: నగరంలో ఉంటున్న సివిల్ కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి (Civil Contractor Janardhan Reddy) చేసిన అప్పులు (Debts) అతని ప్రాణం మీదకు వచ్చాయి. ఈ క్రమంలో అప్పులు ఇచ్చినవారు అతని ఇంటికి రావడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. గత ప్రభుత్వ పాలనలో ఆర్ డబ్ల్యు ఎస్, ఏపీ ఐఐసీ పరిధిలో రూ.6 కోట్ల కాంట్రాక్టు పనులు జనార్దన్ రెడ్డి చేశారు. పనుల కోసం తెలిసిన వారి నుంచి రూ.4.5 కోట్ల అప్పు చేశాడు. రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో వుండటంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఓ ప్రైవేట్ బ్యాంకులో ఓడీ అకౌంట్ రెన్యువల్ కాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి .. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు, దీంతో పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కాగా గత ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. రాష్ట్రంపై ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు మోపారని, వాటికి వడ్డీలు కట్టాలంటూ ప్రతి శుక్రవారం తనకు ఏదో ఒక బ్యాంకు నుంచి ఫోన్‌ వస్తోందని చెప్పారు. వైసీపీ చేసిన విధ్వంసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని జాగ్రత్తగా పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొంచెం సమయం తీసుకున్నా చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వారి బకాయిలను మార్చిలోపు ఎంతో కొంత చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం జీతాలకు, పెన్షన్లకే సరిపోతోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, దీనివల్ల ఆదాయం పెరుగుతుందని, దీంతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త పథకాలకు రూపకల్పన చేయవచ్చని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ.. జగన్‌ హయాంలో తనకు రావాల్సిన రూ.88 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. వాటిని చెల్లించమని పలుమార్లు విన్నవించగా.. పార్టీ మారితే బిల్లులు చెల్లిస్తామని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. 250 మంది కాంట్రాక్టర్లు బిల్లుల కోసం విశాఖలో పార్టీ మారినా కూడా వారి బిల్లులు చెల్లించలేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్

ముప్పే... బాబూ!

వైసీపీ మాదిరి హీరోలను రప్పించం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 05 , 2025 | 08:05 AM