Crop loans వడ్డీతోనే పంట రుణాలు రెన్యువల్ చేయాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:21 AM
వడ్డీ మాత్రమే కట్టించుకొని బ్యాంకుల్లో పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ఏపీ రైతుసంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

కొత్తచెరువు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): వడ్డీ మాత్రమే కట్టించుకొని బ్యాంకుల్లో పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ఏపీ రైతుసంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక యూనియన బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్లకు మంగళవారం వినతిపత్రాలను అందజేశారు. వారు మాట్లాడుతూ... పంటరుణాలు ష్యూరిటీ లేకుండా ఇవ్వాలన్నారు. కొంతమంది దళారులు రెన్యువల్ కోసం రైతులకు అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నారని, అటువంటి వారిని బ్యాంకుల దరిదాపులకు కూడా రాకుండా చూడాలని వారు కోరారు. అదేవిధంగా బ్యాంకు సిబ్బంది కూడా దళారులతో కుమ్మక్కై ముందుగా రెన్యువల్ కోసం ఇచ్చిన వారి పైళ్లు పక్కన పెట్టి ... దళారులు ఇచ్చిన పైళ్లను మాత్రమే రెన్యువల్ చేస్తున్నారని, దీంతో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, నాయకులు వీవీ రమణ, సుధాకర్‌రెడ్డి, ఫకృద్దీన, మారుతి పాల్గొన్నారు.