Share News

Do justice భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయండి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:19 AM

తమరే కేటాయించిన స్థలాన్ని దళారులు ఇతరులకు కేటాయించారని, అర్హులైన తమకు ఆ స్థలం, ఇళ్లు కేటాయించాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్‌ చేశారు.

Do justice భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయండి
ర్యాలీ నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు

కదిరి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): తమరే కేటాయించిన స్థలాన్ని దళారులు ఇతరులకు కేటాయించారని, అర్హులైన తమకు ఆ స్థలం, ఇళ్లు కేటాయించాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్‌ శర్మకు వినతి పత్రం అందజేసిన వారు మాట్లాడారు. 2007లో భవన నిర్మాణ కార్మికులకు పట్టాలు ఇచ్చారని, అందులో ప్రస్తుతం ఎక్కువ మంది అనర్హులున్నారని వాపోయారు. అధికారులు స్పందించి విచారణ చేసి, అర్హులకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Apr 16 , 2025 | 12:19 AM