Share News

English ఇంగ్లీష్‌ సిలబస్‌ తగ్గించాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:16 AM

ఇంగ్లీషులో అదనంగా సిలబస్‌ ఉండటం వల్ల 9, 10 తరగతి విద్యార్థులకు సకాలంలో పాఠాలను పూర్తీ చేయలేకపోతున్నామని, సిలబస్‌ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు.

English ఇంగ్లీష్‌ సిలబస్‌ తగ్గించాలి
డీఈఓకు వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు

కొత్తచెరువు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఇంగ్లీషులో అదనంగా సిలబస్‌ ఉండటం వల్ల 9, 10 తరగతి విద్యార్థులకు సకాలంలో పాఠాలను పూర్తీ చేయలేకపోతున్నామని, సిలబస్‌ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ కార్యాలయంలో డీఈఓ కిష్టప్పకు మంగళవారం వినతిపత్రం ఇచ్చిన వారు మాట్లాడారు. 9,10 తరగతిలో 9 యూనిట్లు అదనంగా సప్లమెంటరీ రీడర్‌, వర్క్‌ బుక్కులు ఉన్నాయని, అధికంగా ఉన్న సిలబస్‌ వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇంగ్లీషులో సిలబస్‌ తగ్గించేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, నాగభూషణ, రవీంద్రరెడ్డి, వెంకటరాముడు, రేష్మాబాను,ఎల్వీరమణ, బాబు, రామ్మూర్తి, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:16 AM