Share News

MLA ప్రతి కార్యకర్తనూ అభివృద్థి చేస్తా

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:17 AM

‘అధికారంలో ఉన్నా.. లేకపోయినా 20 సంవత్సరాలుగా నాకు మీరు... మీకు నేను తోడుగా ఉంటున్నాం. మీ కష్టాలు.. నష్టాలు.. నాకు తెలుసు. మీ అందరిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నా. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా నేను చేపట్టబోయే కార్యక్రమం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారు. ’ అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు.

MLA ప్రతి కార్యకర్తనూ అభివృద్థి చేస్తా
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

కదిరి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ‘అధికారంలో ఉన్నా.. లేకపోయినా 20 సంవత్సరాలుగా నాకు మీరు... మీకు నేను తోడుగా ఉంటున్నాం. మీ కష్టాలు.. నష్టాలు.. నాకు తెలుసు. మీ అందరిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నా. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా నేను చేపట్టబోయే కార్యక్రమం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారు. ’ అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. మంగళవారం స్థానిక పీవీఆర్‌ గ్రాండ్‌లో నిర్వహించిన తలుపుల మండల టీడీపీ విసృత్తస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో కంటే అధికార పక్షంలో ఉన్నప్పుడే బాధ్యతగా అందరూ పని చేయాలన్నారు. అధికారం ప్రజాసేవకు ఉపయోగించాలే తప్ప ప్రజలపై పెత్తనం చెలాయించడానికి కాదన్నారు. 11 నెలలుగా మండలంలో నెలవారీ సమావేశాలు నిర్వహించలేదని, ఇక ప్రతినెలా మండలంలో ముఖ్యనాయకులు సమావేశం కావాలని, మనస్పర్థలు వీడి ప్రతి సమస్యనూ చర్చించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో తలుపుల మండల కన్వీనర్‌ ముబాకర్‌, నాయకులు గరికపల్లి రామక్రిష్ణారెడ్డి, ఆవుల మనోహర్‌రెడ్డి, విజయారెడ్డి, రాజారెడ్డి, వీరభార్గవరెడ్డి, సుదర్శనరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:17 AM