Share News

jyothirao ఫూలే ఆశయాలు కొనసాగిద్దాం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:19 AM

బడుగు, బలహీనవర్గాల సంక్షేమంకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలే ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒకరు కృషి చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పిలుపునిచ్చారు. స్థానిక గణేష్‌ కూడలిలోని అబ్దుల్‌ కలాం మైనార్టీ కమ్యూనిటీ సమావేశ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

jyothirao  ఫూలే ఆశయాలు కొనసాగిద్దాం
ఫూలే చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ టీఎస్‌ చేతన

పుట్టపర్తిటౌన, ఏప్రిల్‌11(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాల సంక్షేమంకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలే ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒకరు కృషి చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పిలుపునిచ్చారు. స్థానిక గణేష్‌ కూడలిలోని అబ్దుల్‌ కలాం మైనార్టీ కమ్యూనిటీ సమావేశ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలంతా సమానత్వంతో జీవించాలని ఫూలే ఆకాంక్షించారన్నారు. గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. విద్య వికాసంతోనే వివక్ష నిర్మూలన సాధ్యమని నమ్మిన వ్యక్తి అన్నారు. బాల్యవివాహాలు, సతీసహగమనం నిర్మూలన కోసం అనే అనేక పోరాటాలు చేశారన్నారు. అలాంటి మహనీయుడి అడుగు జాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి నిర్మలాజ్యోతి, డీఎస్పీ విజయ్‌కుమార్‌, కురుబ కార్పొరేషన డైరెక్టర్‌ శ్రీనివాసులు, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ రామాంజనేయులు, టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, శ్రీరాములు, చలపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:19 AM