Khadrī: ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం
ABN , Publish Date - Mar 20 , 2025 | 07:29 AM
శ్రీ సత్యసాయి జిల్లా: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి (Lakṣmī Nārasimha Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లోభాగంగా గురువారం లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమం కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా: ఖాద్రీ (Khadrī) లక్ష్మీనర సింహస్వామి (Lakṣmī Nārasimha Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లోభాగంగా గురువారం కదిరిలో ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం జరగనుంది. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఉచిత రవాణా, భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లను అధికారులు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read..:
రేషన్ కార్డులు కాదు.. పాపులర్ కార్డులు..
అలరించిన పౌరాణిక ప్రదర్శన
కాగా ఖాద్రీ లక్ష్మీనర సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కదిరి పట్టణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాలికల కళాశాల ఆవరణలో నిర్వహించిన పౌరాణిక ప్రదర్శనకు వేలాది మంది హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన చింతామణి, సత్యహరిశ్చంద్ర, రామాంజినేయుద్ధం నాటకాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రదర్శ నతో ఆకట్టుకున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో నిర్వహించిన ఈ పౌరాణిక నాటక ప్రదర్శనలో తమిళనాడు రాష్ట్రం ఐఆర్‌ఎస్ అధికారి బైరెడ్డి లోకనాథరెడ్డి, బైరెడ్డి కిషోర్‌కుమార్‌రెడ్డి, దామోదర్, కె.మల్లి, పెద్దన్న, గాలివీటి కృష్ణమోహన నాయుడు, జయ, సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ నిర్వాహకులు బండల నాయుడు, కేబీ నాగప్ప, సంగీత మాస్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే ఆలయ ఆవరణంలో హరిదాసు సూర్యనారాయణ హరికథా కాలక్షేపం ఆకట్టుకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు
‘మిర్యాల’ ఘటనలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టం..
For More AP News and Telugu News