OCCULT: పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:36 AM
మండలంలోని కునుకుంట్ల పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్య క్తులు పాఠశాల ఆవరణ లో ఎనుముకు సంబంధించిన పుర్రె, కాళ్ల ఎముకలు ముగ్గుపై ఉంచి పసుపు కుంకుమ చల్లి క్షుద్రపూజలు నిర్వహించారు.
తాడిమర్రి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కునుకుంట్ల పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్య క్తులు పాఠశాల ఆవరణ లో ఎనుముకు సంబంధించిన పుర్రె, కాళ్ల ఎముకలు ముగ్గుపై ఉంచి పసుపు కుంకుమ చల్లి క్షుద్రపూజలు నిర్వహించారు. గురువారం ఉదయం పాఠశాల వాచమన యేసయ్య విషయాన్ని గమనించి హెచఎం లక్ష్మన్న, గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు అక్కడికి చేరుకుని క్షుద్రపూజల గురించి ఆరాతీశారు. అయితే నిజంగా క్షుద్రపూజలు జరిగి ఉంటే రక్తపు మరకలు ఆ ప్రాంతంలో పడి ఉంటాయి. కానీ అవి ఎక్క డా కనిపించలేదు. దీంతో పాఠశాలలోని ఉపాధ్యాయులను,. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఎవరో ఈపని చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాడిమర్రి ఎస్‌ఐ కృష్ణవేణికి హెచఎం ఫిర్యాదు చేశారు.
నాడు-నేడు తీగలే కారణమా?
గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకం కింద విద్యుత కనెక్షనలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. దీనికి అవసరమయ్యే రూ.50వేలు విలువ చేసే వైరుకూడా తెచ్చిపాఠశాలలో భద్రపరిచారు. పది రోజుల క్రితం ఆ వైరు దుండగులు దొంగలించారు. విషయాన్ని గమనించిన టీచర్లు పోలీసులకు సమాచారం ఇవ్వకపోగా ఎవరు చేసి ఉంటారనే ఆరాతీసే పనిలో పడ్డారు. చివరికి పాఠశాలలో పనిచేసే వ్యక్తి ఈ పనిచేసి ఉంటాడని గ్రామస్థులు ఒక నిర్ణయానికి వచ్చారు. అది పూర్తి కాకుండానే పాఠశాలలో క్షుద్రపూజలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Updated Date - Jan 03 , 2025 | 12:36 AM