ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:18 AM

గత 30 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు జరిగిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో గురువారం పార్టీ సీనియర్‌ నాయకులు గుడిపూటి రాఘవేంద్ర చౌదరి, పాలడుగు చంద్ర శేఖర్‌ నాయుడు రూ.లక్ష చొప్పున చెల్లించి ఎమ్మెల్యే చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నారు.

Raghavendra Chaudhary and Chandrasekhar Naidu who are taking permanent membership

అర్బనలో 70 వేలు దాటిన సంఖ్య : ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : గత 30 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు జరిగిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో గురువారం పార్టీ సీనియర్‌ నాయకులు గుడిపూటి రాఘవేంద్ర చౌదరి, పాలడుగు చంద్ర శేఖర్‌ నాయుడు రూ.లక్ష చొప్పున చెల్లించి ఎమ్మెల్యే చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నారు. వారిని ఎమ్మెల్యే శాలువ కప్పి సన్మానిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... సభ్యత్వాల నమోదులో ఈ సారి సరికొత్త రికార్డు నమోదైందని, 30 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా 70వేల మందితో సభ్యత్వం చేయించామన్నారు. నమో దు గడువు 15 రోజులు పొడిగించా రని, లక్ష సభ్యత్వాల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.


ఏడు నెలల్లో రూ.60 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల పంపిణీ

అర్బన నియోజకవ ర్గానికి సంబంధించి గత ఏడు నెలల్లో రూ.60 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో గురువారం ఆరుగురు లబ్ధి దారులకు రూ.5.67 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఏడు నెలల్లో ఏం అభివృ ద్ధి చేశారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు గ్రహించకుండా అసత్యాలు పదే పదే వల్లించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమాల్లో నాయ కులు గంగారామ్‌, రాయల్‌ మురళి, లక్ష్మీనరసింహ, రాంప్రసాద్‌, అమర్‌, ధరూర్‌ నాయుడు, సభ్యత్వాల కో ఆర్డినేటర్‌ విష్ణు, వడ్డే భవాని, వెంకటేష్‌, భక్తవత్సలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 03 , 2025 | 12:18 AM