SPL TRAIN: గుంతకల్లు మీదుగా వేసవి రైలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:24 AM
వేసవిలో ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి బెంగళూరు-కలబురగి మధ్య ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు, ఏప్రిల్4(ఆంధ్రజ్యోతి): వేసవిలో ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి బెంగళూరు-కలబురగి మధ్య ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-కలబురగి ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ (నం.06519) ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో (శనివారాల్లో) బెంగళూరులో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40 గంటలకు కలబురగికి చేరుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06520) ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో (ఆదివారాలలో) ఉదయం 9.35 గంటలకు కలబురగిలో బయలుదేరి అదేరోజు రాత్రి 8 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని తెలియజేశారు. ఈ రైలు యల్హంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్, షాద్‌నగర్ స్టేషన్ల మీదుగా గమ్యస్థానానికి చేరుతుందని వివరించారు.
రైళ్ల పాక్షిక రద్దు: నైరుతి రైల్వేజోన పరిధిలోని క్యాస్టిల్‌రాక్-కులెం రైల్వే సెక్షనలో ట్రాక్ మెయింటెనెన్స పనులు చేస్తున్న కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దుపరచినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. షాలిమార్-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ (నం. 18047) రైలును ఈనెల 17, 19, 21, 22, 24, 26, 28 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 18048)ను ఈనెల 20, 22, 24, 25, 27, 29, మే 1 తేదీల్లోనూ హుబ్లీ-వాస్కోడిగామా సెక్షనలో రైలును పాక్షికంగా రద్దుచేసి, కేవలం హుబ్లీ-షాలిమార్ సెక్షనలో నడపనున్నట్టు తెలియజేశారు. అలాగే తిరుపతి/హైదరాబాద్-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ (నం.17419/17021) రైళ్లను ఈనెల 17, 24 తేదీల్లోనూ, వీటి తిరుగు ప్రయాణపు రైళ్లను ఈనెల 18, 25 తేదీల్లోనూ వాస్కో-హుబ్లీ సెక్షనలో రద్దుచేసి కేవలం హుబ్లీ-హైదరాబాద్/తిరుపతి సెక్షన్లలో నడపనున్నట్టు వివరించారు. సికింద్రాబాద్-వాస్కోడిగామా (నం.17039) రైలును ఈనెల 18, 23, 25 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 17040)ను ఈనెల 19, 24, 26 తేదీల్లోనూ హుబ్లీ-సికింద్రాబాద్ సెక్షనలో మాత్రమే నడపనున్నారు.